ఫ్లోర్ పై పడుకోవడం వలన పొందే హెల్త్ బెన్ఫిట్స్…
శరీరానికి: ఫ్లోర్ పై పడుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ప్రధానంగా దిండు లేకుండా గ్రౌండ్ పై వెళ్లకిలా పడుకుంటే తల, మెడ, వెన్నెముక, హిప్స్ మొత్తం ఉపశమనం పొందుతాయి. అలాగే బాడీ పెయిన్స్‌ను కూడా తగ్గిస్తుంది. వెన్నునొప్పి: చాలామంది బ్యాక్ పెయిన్‌తో బాధపడుతుంటారు. ఈ సమస్య నుంచి ఈజీగా బయటపడాలంటే ఫ్లోర్ పై నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. ఫ్లోర్ పై పడుకున్నప్పుడు వెన్నెముక నిటారుగా, సరైన భంగిమలో ఉంటుంది. దీనివల్ల నొప్పి తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. భుజాలు: ఫ్లోర్ పై పడుకుంటే భుజాల నొప్పులు దరిచేరవు. కనీసం వారానికి మూడుసార్లు ఫ్లోర్ పై పడుకోవడం అలవాటు చేసుకుంటే మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. రక్త ప్రసరణ: ఫ్లోర్ పై పడుకున్నపుడు శరీరంలో రక్త ప్రసరణ చాలా బాగా జరుగుతుంది. రక్త ప్రసరణ సజావుగా ఉంటే గుండెకి సంబంధించిన సమస్యలు రావడానికి ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాదు బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటే మీ శరీరం ఫిట్ అండ్ యాక్టివ్ గా ఉంటుంది.