అందమైన పెదవుల కోసం సింపుల్ మేకప్ టిప్స్…
పెదవులకు లేత రంగులు వేసుకునేటప్పుడు ముందుగా లిప్ బామ్‌ను అప్లై చేసుకోవాలి. పెదవులపై వుండే గీతలు వంటివి దీని వల్ల కాస్త కనిపించకుండా వుంటాయి. లిప్ లైనర్ వేసుకుని తరువాత లిప్‌స్టిక్ వేసుకుంటే చక్కటి ఆకర్షణ వస్తుంది. ముదురు గులాబీ రంగులు ఇష్టపడేవారు క్రీమీగా వుండే వాటిని ఎంచుకుంటే బాగుంటుంది. దీనికి బ్రష్ ఉపయోగించడం మేలు. మరీ ముదురుగా వుండే షేడ్స్ ముఖాన్ని అలసిపోయినట్లు కనిపించేలా చేస్తాయి. ఇవి బ్రైట్ కలర్ వున్న వారికైతేనే నప్పుతాయి. సాధారణ రంగు వున్నవారు వీటి జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఏ మేకప్ వేసుకున్నా ఆ సామాగ్రిని ఆరు నెలలకు మించి ఉపయోగించకపోవడం ఉత్తమం.