దుస్తుల మీద గోరింటాకు మరకలు పోవాలంటే? Povalante henna stains on the dress ?

దుస్తుల మీద గోరింటాకు మరకలు పోవాలంటే?
 సాధారణంగా మహిళలు రాత్రిపూట అరచేతులకు గోరింటాకు పెట్టుకుంటుంటారు. ఇలా పెట్టుకుని నిద్రపోతున్న సమయంలో బట్టలకు, బెడ్‌షీట్లకు గోరింటాకు మరకలు పడుతుంటాయి. వీటిని తొలగించేందుకు నానా తిప్పలు పడుతుంటారు. ఇలా పడిన గోరింటాకు మరకలు పోవడానికి మరకంటిన ప్రదేశాన్ని అరగంటసేపు పాలలో నానెయ్యాలి. తర్వాత శుభ్రం చేస్తే అదే పోతుంది. పాలతో వీలుపడని పక్షంలో నిమ్మకాయ ముక్కతో రుద్ది చూస్తే గోరింటాకు మరకలు పోతాయి.