గుడ్డే కాదు గుడ్డు పెంకు కూడా ఉపయోగకరమే…
1. మట్టిని సారవంతం చేయడానికి: ఎగ్ షెల్స్ ఉపయోగించడం వల్ల ఒక మంచి ఉపయోగం, ఎగ్ షెల్స్లను గార్డెన్ మట్టిలో వేయడం వల్ల మట్టి మరింత సారవంతంగా మారుతుంది. ఎగ్ షెల్స్ ను క్రష్(పొడిపొడిగా చేసి)మట్టిలో స్ప్రెడ్ చేయాలి. ఎగ్ షెల్స్ లో ఉన్న క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల సమృద్ధిగా కంపోస్ట్ నేలగా మారుతుంది. 2. విత్తనాలు మెలకెత్తడానికి : ఎగ్ షెల్స్ లో చిన్న చిన్న మొక్కలను మొలకెత్తించడానికి గుడ్డు యొక్క పెంకు బాగా సహాయపడుతుంది. విత్తనాలు మొలకెత్తడానికి ఎగ్ షెల్ కు చిన్న సన్నటి రంధ్రాన్ని పెట్టాలి. 3. పెట్ ఫుడ్: ఎగ్ షెల్స్ లో క్యాల్షియం, ఐరన్, మరియు మినిరల్స్ సమృద్ధిగా ఉంటాయి. మీ కుక్కలకు కొన్ని న్యూట్రీషియన్ ఫుడ్ ను అందించాల్సి ఉంటుంది. కాబట్టి ఎగ్ షెల్స్ ను చాలా నునుపు పౌడర్ చేసి వాటికిచ్చే ఆహారంతో పాటు ఇవ్వాలి. 4. సేంద్రియ పురుగు మందు: ఎగ్ షెల్స్ ను బాగా మెత్తగా పొడి చేసి వెజిటేబుల్స్ మరియు పండ్లు చుట్టూ చల్లాలి. స్లగ్స్, పురుగులు, ఈగలు ఉన్న వార్డ్స్ లో కూడా చల్లాలి. ఇందులో సేంద్రియ లక్షణాలు కలిగి ఉండటం వల్ల మొక్కలకు హానీ కలిగించదు. 5. క్లీనింగ్: ఎగ్ షెల్స్ ను పొడి చేసి వెనిగర్ తో మిక్స్ చేసి, వంటగదిలోని మరకలు పడ్డ సామాన్లను శుభ్రం చేయవచ్చు. ఇవి మరకలు పడ్డ పాత్రలకు స్ర్కబ్ లా బాగా పనిచేస్తుంది.