నెయిల్ పాలిష్‌ను ఫ్రెష్‌గా ఉండేలా నిల్వ చేసే పద్దతులు…
1. నెయిల్ పాలిష్ ఎండిపోకుండా వుండాలంటే సీసాను ఫ్రిజ్‌లో వుంచండి. నెయిల్ పాలిష్‌ను రిఫ్రిజరేటర్‌లో ఉంచేటప్పుడు బ్యూటి కిట్ షెల్స్ సెపరేట్‌గా ఉంటుంది. అందులో స్టోర్ చేయాల్సి ఉంటుంది. స్టోర్ చేసిన నెయిల్ పాలిష్‌లను ఒక నెలలోపుల ఎడిపోకుండా లేదా చిక్కబడక ముందే ఉపయోగించవచ్చు. 2. మరో బెస్ట్ ఆప్షన్ సూర్యరశ్మి తగలని ప్రదేశంలో కూడా నెయిల్ పాలిష్‌ను స్టోర్ చేసుకోవచ్చు. అందువల్ల త్వరగా పాడవకుండా ఉంటాయి. 3. నెయిల్ పాలిష్ బాటిల్స్‌ను స్టోర్ చేసేటప్పుడు అవి నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల త్వరగా ఎండిపోకుండా ఉండటమే కాకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటుంది. ఒక వేళ నెయిల్ పాలిష్ బాటిల్ పడిపోయినా వెంటనే దానిని తిరిగి నిటారుగా పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల నెయిల్ పాలిష్ బాటిల్‌లో ఉన్న పదార్థాలు విడిపోకుండా నిరోధిస్తుంది.