ఆలూ కాలి మిర్చి రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం…
కావల్సిన పదార్థాలు: బంగాళదుంప: 4 పెప్పర్ కార్న్: 15 పచ్చిమిర్చి: 2(సన్నగా తరగాలి) మెంతులు(మేతి): 1/2tsp పసుపు: 1/2tsp నెయ్యి: 2tbsp ఉప్పు: రుచికి సరిపడా పంచదార: 1/2tsp తయారుచేయు విధానం: 1. ముందుగా బంగాళదుంపలను ప్రెజర్ కుక్కర్లో వేసి రెండు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి. 2. తర్వాత కుక్కర్లో ఆవిరి పోయాక మూత తీసి, బంగాళదుంపల యొక్క పొట్టు తొలగించాలి. తర్వాత రఫ్‌గా మ్యాష్ చేసుకోవాలి. 3. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. తర్వాత అందులో మెంతులు వేసి, పెప్పర్ కార్న్ మరియు పచ్చిమిర్చి వేయాలి. 4. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకొన్న బంగాళదుంపలు అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. రెండు నిముషాలు మీడియం మంట మీద వేగించుకోవాలి. 5. ఇప్పుడు రఫ్‌గా పొడి చేసుకొన్న పెప్పర్ పౌడర్, ఉప్పు, పసుపును చిలకరించాలి. 6. మొత్తం మిశ్రమాన్ని కలగలుపుతూ, 5నిముషాలు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి. 7. చివరగా కొద్దిగా పంచదార చిలకరించి, టేస్ట్‌ను బ్యాలెన్స్ చేయాలి. అంతే టేస్టీ ఆలూ కాలీ మిర్చి క చోహ ను వేడి వేడి పూరీలతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది.