సక్కర్వల్లి స్వీట్ ఎలా తయారుచేయాలో చూద్దాం…
కావల్సిన పదార్థాలు: స్టఫ్ చేయడానికి కావల్సినవి బెల్లం: 1 cup యాలకలపొడి: 1 teaspoon స్వీట్ పొటాటోలు: 5 ఉప్పు: చిటికెడు పోలి తయారుచేయడానికి కావల్సినవి: నూనె: 1 tablespoon మైదా: 1 cup maida నెయ్యి: కొద్దిగా నీళ్ళు: పిండికలుపుకోవడానికి సరిపడా తయారుచేయు విధానం: 1. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మైదా, నెయ్యి, ఉప్పు , కొద్దిగా బియ్యం పిండి మరియు రవ్వ వేయాలి. మొత్తం మిశ్రమాన్ని చేత్తో కలుపుకోవాలి. తర్వాత సరిపడా నీళ్ళు పోసి పిండిని సాఫ్ట్‌గా కలుపుకోవాలి. 2. ఇలా కలిపుకొన్న పిండిని ఒక గంట వరకూ అలాగే ఉండనివ్వాలి. 3. అంతలోపు ప్రెజర్ కుక్కర్లో స్వీట్ పొటాటో వేసి బాయిల్ చేసుకోవాలి. ఎక్కువగా ఉడికించకుండా మీడియంగా ఉడికించుకోవాలి. 4. ఉడికిన తర్వాత వాటిని బయటకు తీసి, తొక్కను తొలగించాలి. ఇప్పుడు వాటిని ముక్కలుగా చేసి మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. 5. ఇప్పుడు స్టౌ మీద గిన్నెలో కొద్దిగా నీళ్లు తీసుకొని అందులో బెల్లం వేసి కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చిక్కగా ఉండే బెల్లం నీటితో పొటాటో మిశ్రమంతో కలిపి 5-10నిముషాలు తక్కువ మంట మీద ఉడికించాలి. మొత్తం మిశ్రమం కలగలుపుతూ ఉడికించుకోవాలి. 6. ఇప్పుడు యాలకలపొడి కూడా తీసుకొని పొటాటో మిశ్రమంలో వేసి మిక్స్ చేసి, పక్కనుంచుకొని చల్లారనివ్వాలి. 7. తర్వాత మైదాపిండి ముద్దలో నుండి కొద్దిగా నిమ్మకాయంత తీసుకొని ఫ్లాట్‌గా చేసి అందులో స్వీట్ పొటాటో మిశ్రమం కొద్దిగా తీసుకొని మైదా చపాతీ మద్యలో ఉండచేసి పెట్టాలి. 8. ఇలా కొన్ని తయారుచేసి పెట్టుకొన్నాక, చిన్న సైజు పూర్ణం పోలిలను తయారుచేసుకోవాలి. ఇలా అన్ని పోలిల్లా రుద్ది పెట్టుకొన్నాక. పాన్ స్టౌ మీద పెట్టి నెయ్యి లేదా నూనెతో రెండువైపులా గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ కాల్చుకోవాలి. అంతే సక్కరవల్లి స్వీట్ రెడీ. వేడి వేడిగా కొద్దిగా నెయ్యితో సర్వ్ చేస్తే చాలా టేస్ట్‌గా ఉంటాయి.