కీబోర్డ్స్ , మొబైల్స్, రిమోట్స్ శుభ్రం చేసే ఇయర్ బడ్స్… Keyboards , mobiles , RemoteSpy Ear Buds to clean

కీబోర్డ్స్ , మొబైల్స్, రిమోట్స్ శుభ్రం చేసే ఇయర్ బడ్స్…
 1. కంప్యూటర్ కీబోర్డ్స్: కంప్యూటర్ కీబోర్డ్స్ లో దుమ్ము, ధూళి చాలా సులభంగా చేరుతుంది. ఈ దుమ్ము, ధూళిని శుభ్రం చేయడం కొంచెం కష్టం లవుతుంది. ఎప్పుడూ డస్టర్ తో శుభ్రం చేయడానికి వీలు పడదు. అటువంటి కష్టతరమైన ప్రదేశాల్లో శుభ్రం చేయడానికి ఇయర్ బడ్స్ బాగా సహాయపడుతాయి. 2. రిమోట్ కంట్రోల్: కీబోర్డ్ లాగే రిమోట్ కంట్రోల్ కూడా శుభ్రం చేయడం కష్టమే. కీస్ మద్య చేరిన దుమ్ము, ధూలి శుభ్రం చేయడానికి, ఇయర్ బడ్స్ చాలా సులభంగా సహాయపడుతాయి. ఇయర్ బడ్స్ ను వెనిగర్ లో డిప్ చేసి మరింత ఉత్తమంగా శుభ్రం చేయవచ్చు. 3. సోఫా కార్నర్స్ : మీ ఇంట్లో లెదర్ సోఫా, ఉన్నట్లైతే, కార్నర్స్ లో దుమ్ము, ధూళి చేరి ఉండటాన్ని మీరు గమనించే ఉంటారు. కాబట్టి, ఇయర్ బడ్స్ ను ఉపయోగించి సోఫా కార్నర్ ప్రదేశాలను కూడా శుభ్రం చేయండి. 4. టేబుల్ కార్నర్: కొన్ని సందర్భాల్లో మీ ఇంట్లో టేబుల్ గ్లాస్ తో ఫిట్ చేయబడి ఉంటుంది. ఆ ప్రదేశంలో శుభ్రం చేయడానికి కష్టం అవుతుంది. మూలల్లో దుమ్ము, ధూళిని తొలగించడానికి ఇయర్ బడ్స్ ను ఉపయోగించండి. మీరు ఇయర్ బడ్స్ ను సోప్ వాటర్ లో వేసి, తర్వాత మురికిబడ్డ ప్రదేశాన్ని శుభ్రం చేయాలి.