ఇంట్లో ఫోటో ఫ్రేములు అందంగా డెకరేట్ చేసుకోవడం ఎలా… How to make homemade photo frames beautifully dekaret

ఇంట్లో ఫోటో ఫ్రేములు అందంగా డెకరేట్ చేసుకోవడం ఎలా…
 ఒకే రంగులో : గోడలపైన అమర్చే ఫోటో ఫ్రేములు ఒక రంగులో ఉండేవి ఎంచుకోవడం మంచిది. కొంతమంది మరింత ఆకర్షణీయంగా కనిపించాలనే ఉద్దేశంతో రంగురంగుల ఫోటో ఫ్రేముల్ని ఒకే గోడపై అమర్చుుతుంటారు. దాంతో అన్ని రంగులు గోడ రంగులకు సరిపోక వాటి అందం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాగే చూసేటప్పుడు ఆ రంగుల ప్రభావం కంటిపై కూడా పడవచ్చు. ఇవే కాకుండా ఫోటోలను రంగురంగుల ఫ్రేముల్లో అమర్చడం వల్ల ఆ ఫోటోల మధ్య వైవిధ్యం కూడా తెలియకపోవచ్చు. కాబట్టి ఇవన్నీ జరగకుండా ఉండాలంటే, ఒకే రంగులో ఉండే ఫ్రేముల్నే ఎంపిక చేసుకోవడం మంచిది. ఫలితంగా గోడ, ఫోటో ఫ్రేములు..రెండూ అందంగా కనిపిస్తాయి. కనుచూపు మేరలో: కొంత మంది ఫోటో ఫ్రేములను గోడలపై మరీ ఎత్తుగా అమర్చుతుంటారు. దీని వల్ల చూసేవారికి ఫోటోలు సరిగ్గా కనిపించవు.. అలాగే మీరు ఎంత మంచి ఫోటో ఫ్రేముల్ని అమర్చినా అంత ఎత్తులో తగిలించడం వల్ల వాటి అందం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి చూసేవారికి కనుచూపు మేరలో అంటే సులభంగా ఫోటో కనిపించేలా గోడపై తక్కువ ఎత్తులో ఫ్రేముల్ని అమర్చాలి. దీంతో గోడ ఆకర్షణీయంగా కనిపించడంతో పాటు ఫోటోలూ నీట్ గా అందంగా కనిపిస్తాయి. అలాగే ఫ్రేముల్లోని ఫోటోలను సులభంగా మార్చడానికి కూడా వీలుగా ఉంటుంది. సమానమైన పరిమాణంలో: గోడలపై అమర్చడానికి సమాన పరిమాణంలో ఉండే ఫోటో ఫ్రేములను ఎంపిక చేసుకోవడం మంచిది. ఒక వేళ ఫోటో సైజు ఫ్రేమ్ పరిమాణం కంటే ఎక్కువ లేదా తక్కువగా ఉన్నట్లైతే దాన్ని ఫ్రేమ్ పరిమాణానికి తగినట్లుగా రీసైజ్ చేయించుకోవాలి.