హాట్ ఆయిల్ మెనిక్యూర్ చేయు విధానం మరియు దాని వల్ల కలిగే ప్రయోజనాలు… Hot Oil menikyur process and the benefits of its

హాట్ ఆయిల్ మెనిక్యూర్ చేయు విధానం మరియు దాని వల్ల కలిగే ప్రయోజనాలు…
- సన్‌ఫ్లవర్ ఆయిల్, ఆముదం, బాదాం ఆయిల్, విటమిన్ E ఆయిల్, ఆలివ్ ఆయిల్ మరియు టీ ట్రీ ఆయిల్ తీసుకోవాలి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసి మైక్రోవేవ్‌లో 30 సెకన్స్ హీట్ చేయాలి. ఇప్పుడు ఈ ఆయిల్‌లోకి విటమిన్ E ట్యాబ్లెట్స్ పొడిచేసి కలుపుకోవాలి. అయితే ఆయిల్ మరీ వేడిగా ఉండకూడదు.  - ఇప్పుడు మీ చేతి వేళ్లను ఆ ఆయిల్‌లో పెట్టుకోవాలి. ఆయిల్ పూర్తీగా చల్లారే వరకు చేతులు అందులోనే ఉండాలి. ఇంకా కొద్దిసేపు పెట్టుకోవాలి అనుకుంటే ఆయిల్‌ని మళ్లీ 10 సెకన్లు హీట్ చేసి మళ్లీ చేతి వేళ్లు ఆయిల్‌లో పెట్టుకోండి.  - తర్వాత చేతులు, నెయిల్స్‌ని ఏదో ఒక ఆయిల్‌తో మసాజ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత నీటితో చేతులు శుభ్రం చేసుకుని టవల్‌తో తుడుచుకోవాలి. కాస్త మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. అంతే హాట్ ఆయిల్ మెనిక్యూర్ అయిపోయింది. ఇలా వారానికి రెండుసార్లు రాత్రి పడుకునే ముందు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.  - హాట్ ఆయిల్ మెనిక్యూర్ వల్ల నెయిల్స్ హెల్తీగా, షైనింగ్‌గా ఉంటాయి. అలాగే స్ట్రాంగ్‌గా, ఫాస్ట్‌గా పెరుగుతాయి. ఇలా మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మెరుగ్గా ఉండి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. హాట్ ఆయిల్ మెనిక్యూర్ వల్ల చేతులు హెల్తీగా ఉంటాయి. చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి.