వంటగదిలో చెక్క పాత్రలు శుభ్రం చేయడానికి సులభ చిట్కాలు…Handy tips to clean up the kitchen, wooden characters

వంటగదిలో చెక్క పాత్రలు శుభ్రం చేయడానికి సులభ చిట్కాలు…
 ఉడెన్ స్పూన్లు, ఫోర్క్లు లేదా వంటకు ఉపయోగించే చెక్క వంట వస్తువులు కర్రీ వాసన వస్తున్నాయా..? లేదా మరేదైనా చెడు వాసన వాస్తున్నాయా? లేదా అవి పాతబడిపోయి అసహ్యాంగా కనబడుతున్నాయా? అందుకు మీరు చింతించాల్సిన పనిలేదు వంటగదిలో ఉపయోగించే ఉడెన్ వస్తువులను, కొన్ని వంటగది పదార్థాలను ఉపయోగించి కొత్తవాటిలా మెరిపించవచ్చు. అవేంటో తెలుసుకుందాం... నిమ్మరసం: నిమ్మరసం బెస్ట్ కిచెన్ క్లీనింగ్ ఏజెంట్. నిమ్మరసంతో ఎప్పుడైనా. ఏ వస్తువైనా శుభ్రం చేసుకోవచ్చు. నిమ్మరసంను కొద్దిగా వేడి నీటిలో వేసి, ఆ నీటిలో వంటగదిలోని ఉడెన్ (చెక్కపాత్రలను లేదా వంటకు ఉపయోగించే చెక్క వంట వస్తులను)వేయాలి. ఈ లెమన్ వాటర్ లో 15 నిముషాలు డిప్ చేయాలి. నీరు చల్లబడిన తర్వాత తిరిగి వేడి నీళ్ళను జోడించి మరో 15 నిముషాల తర్వాత నీటిలో నుండి బయటకు తీసి పొడి వస్త్రంతో శుభ్రంగా తుడిచేసుకోవాలి. తర్వాత ఎండలో పెట్టి, పూర్తిగా డ్రై చేయాలి.  వెనిగర్: ఒక గ్లాసు వెనిగర్ ఒక బౌల్లో వేసి అందులో ఒక చెంచా తేనె వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు కాటన్ బాల్ ను బౌల్లో డిప్ చేసి, ఎక్సెస్ వాటర్ పిండేసి, ఆ కాటన్ తో వంటగదిలోని వంటకు ఉపయోగించే చెక్క పాత్రలను తుడవాలి. పూర్తిగా తుడిచిన తర్వాత తిరిగి మరో సారి ఇలాగే చేయాలి.  సాల్ట్ : మరో బెస్ట్ క్లీనింగ్ ఏజెంట్ ఉప్పు ఒక బౌల్లో వేడి నీళ్ళు తీసుకొని అందులో ఉప్పు వేసి ఆ నీటితో చెక్క పాత్రలను శుభ్రం చేయాలి . సాల్ట్ వాటర్ లో శుభ్రం చేయాల్సిన వస్తువులు వేసి ఒక 5 నిముసాలు నీటితో మరిగించాలి. తర్వాత ఆ నీటిని వంపేసి, పొడి వస్త్రంతో తుడవాలి. తర్వాత ఎండలో కనీసం ఒక రోజంతా ఎండనివ్వాలి.  బేకింగ్ సోడ: బేకింగ్ సోడాకు కొద్దిగా నిమ్మరసం జోడించి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ ను ఉడెన్ పాత్రలకు అప్లై చేసి 15 నిముషాలు నానబెట్టి, ఆ తర్వాత మొదట వేడి నీళ్ళతోను, తర్వాత చల్లనీటితోనూ శుభ్రం చేసుకోవాలి.  గోరువెచ్చని నీళ్ళు: మరో బెస్ట్ అండ్ సింపుల్ రిసిపి, హాట్ వాటర్. వాటిని మీరు వంటగదిలో ఉపయోగించిన ప్రతి సారి వేడినీళ్ళతో శుభ్రం చేయాలి.