ఎర్లీ మార్నింగ్ సాల్ట్ వాటర్ త్రాగడం వల్ల పొందే గ్రేట్ బెనిఫిట్స్…Early Morning Salt Water Drinking gain great benefits

ఎర్లీ మార్నింగ్ సాల్ట్ వాటర్ త్రాగడం వల్ల పొందే గ్రేట్ బెనిఫిట్స్…
జీర్ణక్రియను మెరుగుపడుతుంది: నేచురల్ సాల్ట్ వాటర్ త్రాగిన తర్వాత లాలాజల గ్రంథులు అభివ్రుద్ది చెందుతాయి మరియు స్టొమక్ యాసిడ్స్ క్రమంగా స్రవిస్తాయి. దాంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది.  ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది:శరీరంలో సోడియం తగ్గినప్పుడు రెనిన్ అనే ఎంజైమ్ మరియు ఆల్డోస్టిరోన్ (హార్మోన్)ఇన్ఫ్లమేషన్‌కు కారణం అయ్యే వీటిని పెంచుతుంది. దాంతో ఇన్ఫ్లమేషన్‌కు గురికావల్సి వస్తుంది. అందువల్ల కొద్దిగా నేచురల్ సాల్ట్ వాటర్ త్రాగడం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవచ్చు.  బోన్ హెల్త్‌కు: సాల్ట్ వాటర్ ఇండైరెక్ట్‌గా బోన్ హెల్త్‌కు సహాయపడుతుంది. మీ రక్తంలో బ్లడ్ అసిడిక్‌గా మారినప్పుడు శరీరం ఎముకల్లోని క్యాల్షియంను ఉపయోగించుకుంటుంది. అలాంటి పరిస్థితిలో సాల్ట్ వాటర్ తీసుకొన్నప్పుడు శరీరంను నేచురల్‌గా ఆల్కలైస్ చేస్తుంది, దాంతో బోన్స్ సురక్షితంగా ఉంటాయి.  నిద్ర: నేచురల్ సాల్ట్‌లోని కొన్ని రకాల మినిరల్స్ నాడీవ్యవస్థను రిలాక్స్ చేయడానికి మరియు స్ట్రెస్ హార్మోనులను తగ్గించడానికి సహాయపడుతుంది. దాంతో మీరు పీస్‌ఫుల్‌గా నిద్రపోవచ్చు. డిటాక్సిఫై అవుతుంది: సాల్ట్ వాటర్లో ఉండే వివిధ రకాల మినిరల్స్ బాడీ డిటాక్సిఫికేషన్‌కు సహాయపడుతుంది. మరియు ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్స్ జీవక్రియల్లో(ప్రేగుల్లో) బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. శరీరంను హైడ్రేషన్‌లో ఉంచుతుంది: నేచురల్ సాల్ట్ వాటర్ త్రాగడం వల్ల శరీరం వాటర్‌ను గ్రహిస్తుంది మరియు తగిన విధంగా ఉపయోగించుకుంటుంది. సాధారణంగా మనం ఎక్కువగా ప్లెయిన్ వాటర్ తీసుకుంటుంటాము ఇది యూరిన్ రూపంలో బయటకు వచ్చేస్తుంటుంది. కానీ సాల్ట్ వాటర్ త్రాగడం వల్ల శరీరం కొద్దిగా సాల్ట్‌ను నిల్వ చేసుకోగలుగుతుంది.