బియ్యంతో ఎప్పుడూ ప్రయత్నించని ఆశ్చర్యకమైన గృహ ప్రయోజనాలు…
తడిసిన ఎలక్ట్రానిక్స్ ను రక్షించుకోండి: అనుకోకుండా మీ ఫోన్ తడిసిందా? బియ్యంతో దానిని తిరిగి పునరుద్దరించుకోవచ్చు. బ్యాటరీని తొలగించండి. ఒక వెడల్పాటి గిన్నెలోకి బియ్యం తీసుకుని, దానిలో ఈ తడిసిన భాగాలిని ఉంచండి. ఒక రాత్రంతా అలానే వదిలేయండి. బియ్యం మీ పరికరానికి హాని చేసే తేమను గ్రహిస్తుంది. అలా కాకుండా తేమను తొలగించటానికి హెయిర్ డ్రైయర్ ను వాడితే, తేమ ఆరిపోదు సరికదా! మీ ఫోన్ లో మెటల్ భాగాలు కరగవచ్చు. మీ పరికరాలని తుప్పు పట్టకుండా చూసుకోండి: లోహాలు ఎక్కువకాలం బయట ఉంచినప్పుడు ఆక్సిజన్ మరియు తేమ పీల్చి తుప్పు పడతాయి. మీ టూల్ బాక్స్ లో పిడెకుడు బియ్యం ఉంచి, అందులో సురక్షితంగా టూల్స్ ఉంచండి. బియ్యం గాలిలోని తేమను గ్రహించి టూల్స్ తుప్పు పట్టకుండా మరియు పొడిగా ఉండేట్లు చేస్తుంది. వెండి వస్తువులకు పట్టిన నల్లటి తారు మురికిని వదిలించండి: మీ వెండి వస్తువులను ఉంచే స్థలంలో ఒక చిన్న గిన్నెలో బియ్యాన్ని ఉంచండి. ఈ బియ్యం గాలిలోని తేమను గ్రహిస్తాయి. అందువలన మీ వెండి వస్తువులు మెరుపును కోల్పోవు.