కూరల్లో ఉప్పు ఎక్కువైందా?గాభరాపడకండి.. ఈ చిట్కాలు ఫాలోఅయిపోండి.The curries increasing salt ? Gabharapadakandi .. phaloayipondi these tips

కూరల్లో ఉప్పు ఎక్కువైందా?గాభరాపడకండి.. ఈ చిట్కాలు ఫాలోఅయిపోండి.
 వంటచేసేటప్పుడు అప్పుడప్పుడూ అనుకోకుండా కూరల్లో ఉప్పు ఎక్కువగా వేసేస్తుంటాము. అయితే అలా ఎక్కువైన ఉప్పుని వెనక్కి తీయలేకపోయినా దాని వల్ల కూర రుచి చెడిపోకుండా మాత్రం జాగ్రత్త పడవచ్చు. అదెలాగంటే... 1. కూరలో ఉప్పు ఎక్కువైనప్పుడు దానికి కొద్దిగా కొబ్బరిపాలు జత చేయాలి. ఇలా చేడయం వల్ల కూరల్లో ఉప్పదనం తగ్గి రుచికరంగా ఉంటుంది. 2. మరో చిట్కా ఒక బంగాళదుంప తీసుకొని ఓవెన్ లో 5నిముషాలు బేక్ చేసుకొని, తర్వాత తొక్క తీసేసి, నాలుగు ముక్కలుగా కోసి కూరలో వేయాలి. 5నిముషాల పాటు అందులోనే బంగాళదుంప ముక్కలను ఉంచడం వల్ల ఎక్కువైన ఉప్పుని ఇవి గ్రహించేస్తాయి. 3.మరో అద్భుత చిట్కా, రెండు లేదా మూడు కప్పుల పెరుగును కూరలో కలపడం వల్ల ఉప్పు తగ్గడమే కాదు రుచి కూడా పెరుగుతుంది. పెరుగు వేయడం ఇష్టం లేని వారు దానికి బదులుగా కొద్దిగా మీగడని కూడా ఉపయోగించవచ్చు. 4.ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, నూనెలో వేయించి కూరలో కలపడం వల్ల రుచికి రుచి మరియు ఉప్పదనం కూడా తగ్గుతుంది. 5.మీరు చేసే వంటకాన్ని బట్టి టమోటో ముక్కలు లేదా టమోటో పేస్ట్ ని కూడా జత చేయవచ్చు. 6.గోధుమ పిండికి కొద్దిగా నీటిని జతచేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని, వీటిని కూరలో వేసి 3 నుండి 4నిముషాలు ఉడకనివ్వాలి. ఇవి కూరలో ఎక్కువగా ఉప్పుని గ్రహించేస్తాయి. తర్వాత వీటిని బయటకు తీసేయవచ్చు. ఇవి కొన్ని చిట్కాలు మాత్రమే..ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ మీరు గుర్తుంచుకుని, సందర్భం ఎదురైనప్పుడు ఉపయోగించడానికి ప్రయత్నించండి. ‘కుకింగ్ క్వీన్' అనిపించుకోండి.