చీమల బెడదను వదిలించుకోవడానికి సులభమైన చిట్కాలు..Ant easy tips to get rid of the risk

చీమల బెడదను వదిలించుకోవడానికి సులభమైన చిట్కాలు..
 చాక్ పీస్: చాక్ పీస్ తో గీసిన గీత దాటి అవి లోపలికి రాలేవు. అందుకు కారణం మాత్రం తెలియదు. ఇది ఒక అద్భుతమైన ఉపాయం. కాబట్టి, చీమలు ప్రవేశించే ప్రదేశం నుండి అవి తిరిగే ప్రదేశం వరకూ చాక్ పీస్ తో రౌండ్స్ లేదా గీతలు గీయండి. తప్పకుండా ఫలితం కనిపిస్తుంది. బేబీ పౌడర్: చీమలను నివారించడానికి ఇది ఒక సురక్షితమైన మరియు సులభమైన హోం రెమెడీ .కొద్దిగా బేబీ పౌడర్ ను చీమలున్న ప్రదేశంలో చిలకరించాలి. ఇలా చేయడం వల్ల ఇది చీమలు ఇంట్లోకు రాకుండా నివారిస్తుంది. కాఫీ గింజలు: చీమలకు కాఫీ వాసనంటే పడదు. కాబట్టి మీరు ఉపయోగించిన కాఫీ గింజలను లేదా కాఫీ పౌడర్ ను చిలకరించినా చాలు చీమలు రాకుండా నివారించుకోవచ్చు.