ఉసిరి కాయ జ్యూస్‌తో అనారోగ్య సమస్యలు దూరం… Amla berry juice from health problems

ఉసిరి కాయ జ్యూస్‌తో అనారోగ్య సమస్యలు దూరం…
అధిక కొలెస్ట్రాల్, షుగర్ సమస్యలతో అనేక మంది బాధపడుతున్నారు. వీటిని ఎప్పటికప్పుడు నియంత్రించకపోతే ఇతర అనారోగ్య సమస్యలు కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ సమస్య నుండి విముక్తి పొందాలంటే ఉసిరిని నిత్యం తీసుకోవడం వల్ల ఈ వ్యాధుల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.
విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ పుష్కలంగా ఉండే ఉసిరితో తయారు చేసిన జ్యూస్‌ను తాగితే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడంతోపాటు రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచుకోవచ్చు.
అయితే ఇప్పుడు ఆ ఉసిరి జ్యూస్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
ముందుగా రెండు పెద్ద ఉసిరి కాయలను తీసుకుని వాటిలోని గింజల్ని తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిని ఒక కప్పు నీటితో కలిపి మిక్సీలో గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని శుభ్రమైన గుడ్డతో వడకట్టాలి. దీంతో జ్యూస్ తయారవుతుంది. అందులో కొద్దిగా బ్లాక్ సాల్ట్, లేక  కొంచెం తేనెను కలిపి తీసుకోవాలి. ఈ జ్యూస్‌ను క్రమంగా తీసుకుంటే రోగాల బారి నుండి బయటపడవచ్చు.